చెత్త వేరు చేసే యంత్రానికి భూమిపూజ

24-10-2026 | 03:07pm

జనగామ,(విజయక్రాంతి): జనగామ పురపాలక సంఘం(Jangaon Municipality) పరిధిలోని డంపింగ్ యార్డులో తడి, పొడి చెత్త(Waste Segregation Plant)ను వేరు చేసే యంత్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ యంత్ర ఏర్పాటుకు సంబంధించి భూమిపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జనగామ మున్సిపల్ చైర్ పర్సన్ కడకంచి బాలమణి శ్రీనివాస్(Chairperson Kadakanchi Balamani Srinivas) భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు.

పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న చెత్త సమస్యకు ఈ యంత్రం ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆమె తెలిపారు. తడి, పొడి చెత్తను వేరు చేయడం వల్ల పరిశుభ్రత మరింత మెరుగవుతుందని, పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పురపాలక సంఘం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక అధికారి, పాలక మండలి సభ్యులు, పురపాలక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు