ఉచిత నేత్ర శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

24-10-2026 | 03:13pm

వనవాసి కళ్యాణి పరిషత్

శంకర్ నేత్రాలయం ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

ఉట్నూర్,(విజయక్రాంతి): ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల కంటి పరీక్షలు నిర్వహించేందుకు చెన్నైకి చెందిన  శంకరన్ నేత్రాలయం  వైద్యులు ముందుకు రావడం హర్షనీయమని వనవాసి కళ్యాణ పరిషత్ ఆల్ ఇండియా అధ్యక్షుడు హెచ్ కె నాగు అన్నారు. శనివారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని నాగోబా విద్యాలయంలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తొమ్మిది రోజులపాటు నాగోబా విద్యాలయంలో నిర్వహించే ఉచిత  కంటి వైద్య శిబిరాన్ని  సద్వినియోగం చేసుకోవాలని  కోరారు.

చెన్నైకి చెందిన  శంకరన్ నేత్రాలయం వైద్యులు  వేల కిలోమీటర్ల దూరం నుండి ఏజెన్సీ ప్రాంతానికి వచ్చి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడంతోపాటు  మొబైల్ అంబులెన్స్ లోని  కంటి ఆపరేషన్ నిర్వహించడం  అభినందనీయమన్నారు. ఉచిత కంటి వైద్య శిబిరంలో శంకరన్ నేత్రాలయం వైద్యులు  కస్తిటిక్, అలెక్స్ తో పాటు  50 మంది వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డివి రావు, మెస్రం జంగు ల తో పాటు  రిమ్స్ ఆస్పత్రి కంటి వైద్యులు  కృష్ణ, జాడి లింగేష్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు