క్రీడాలోకంలో విషాదం.. గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య
మూడు సార్లు ఏషియన్ ఛాంపియన్.. గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ యాదవ్ మృతి
న్యూఢిల్లీ, అక్టోబర్ 28 (విజయక్రాంతి): భారత పారా అథ్లెటిక్స్‌లో విషాదం నెలకొంది. మూడు సార్లు Asian Para Gamesలో పతకాలు సాధించిన ప్రముఖ Javelin Throw అథ్లెట్ నీరజ్ యాదవ్ (42) మృతి చెందారు. మంగళవారం తన ఫ్లాట్‌లో ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు జాతీయ పారా అథ్లెటిక్స్ చీఫ్ కోచ్ ఎస్. సత్యనారాయణ ధ్రువీకరించినట్లు IANS తెలిపింది. ఈ ఘటనకు దారితీసిన కారణాలు ఇంకా తెలియాల్సి ఉందని కోచ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నీరజ్ యాదవ్ చిన్న వయసులోనే పోలియో బారినపడ్డారు. ఏడేళ్ల వయసు నుంచి Wheelchair ఆయన జీవితంలో భాగమైంది. అయినప్పటికీ, క్రీడలపై ఆసక్తితో ముందుకు సాగిన ఆయన సుమారు ఏడేళ్లపాటు Wheelchair Tennis ఆడారు. అనంతరం 2015లో Athleticsలో అడుగుపెట్టారు. అదే ఏడాది Delhi State Athletics Meetలో Shot Put, Javelin Throw, Discus విభాగాల్లో Gold Medals సాధించి తన ప్రతిభను చాటుకున్నారు.
2016లో Fazza Grand Prixలో పురుషుల Shot Put, Discus F55 విభాగాల్లో Silver Medals గెలుచుకున్నారు. 2018 Asian Para Gamesలో Javelin Throw F55 విభాగంలో 29.84 మీటర్ల దూరం విసిరి Asian Recordతో Gold Medal సాధించి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. 2022లో చైనాలోని Hangzhouలో జరిగిన Asian Para Gamesలో Discus Throw, Javelin Throw విభాగాల్లో మరో రెండు స్వర్ణాలు గెలిచారు. అదే ఏడాది మొరాకోలో జరిగిన Marrakech Para Athletics Grand Prixలోనూ Gold Medalతో పాటు Indian National Record నెలకొల్పారు. కష్టాలను అధిగమించి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నీరజ్ యాదవ్ మృతి పారా స్పోర్ట్స్ వర్గాల్లో విషాదాన్ని నింపింది. ఆయన మరణానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఘటన వెనుక ఉన్న పరిస్థితులు ఇంకా అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.