శనిగపురంలో ఘనంగా ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన
29-11-2026 | 01:01pm
మహబూబాబాద్ జిల్లా: శనిగపురంలో శ్రీశివలింగ స్థిర ప్రతిష్ఠ, శ్రీ సీతారామచంద్ర శివసుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో రాతి ధ్వజస్తంభం (Flagstaff), నంది, నవగ్రహ ప్రతిష్ఠ (Consecration) మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. జయజయధ్వానాల మధ్య ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన (Temple Ceremony) అత్యంత వైభవంగా సాగింది. దీంతో శనిగపురంలో పండగ వాతావరణం నెలకొంది.