ఎస్ఐఆర్పై కాంగ్రెస్ నేతల సంయుక్త జిల్లా సమావేశం
26-10-2026 | 05:14pm
మహబూబ్‌నగర్ (విజయక్రాంతి): మహబూబ్‌నగర్(Mahabubnagar)లో నిర్వహించిన “ఎస్ఐఆర్ – ఓటు బచావో, దేశ్ బచావో” సంయుక్త మహబూబ్‌నగర్ జిల్లా సమావేశానికి ఏఐసీసీ పరిశీలకులు రవీంద్ర దాస్, టీపీసీసీ సమన్వయకర్త రాచమల్ల సిద్ధేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ కుమార్ గౌడ్ వారికి ఘన స్వాగతం పలికారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ సమక్షంలో రవీంద్ర దాస్‌ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఏపీ మిథున్ రెడ్డి, చెందు యాదవ్‌తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.