గ్రామ అభివృద్ధే నా ధ్యేయం
గ్రామస్తులంతా బాధ్యత తీసుకోవాలి: సర్పంచ్ అనూష సతీష్‌రెడ్డి
మహమ్మదాబాద్,(విజయక్రాంతి): మండల పరిధిలోని చౌదర్‌పల్లి గ్రామం(Chowdarpally Village)లో సర్పంచ్ అనూష సతీష్‌రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్(Swachh Bharat Program)లో భాగంగా, పచ్చదనం–పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. పారిశుద్ధ్య కార్మికులు(Sanitation workers), గ్రామస్తులతో కలిసి ప్రధాన వీధులు,కాలనీల్లో చెత్తను తొలగించారు.
గ్రామ అభివృద్ధి,పరిశుభ్రతే తన ధ్యేయమని సర్పంచ్ తెలిపారు. చెత్తను చెత్త కుండీల్లో వేయాలని, మురుగునీరు రోడ్లపై నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన గ్రామ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రమాదేవి, వార్డు సభ్యులు లలిత, ఆనంద్, కృష్ణయ్య,పారిశుద్ధ్య కార్మికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.