గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు
02-10-2026 | 05:10pm
మహమ్మదాబాద్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): గాంధీ జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కే.ఎం.నారాయణ(Mandal Congress President K.M. Narayana) మాట్లాడుతూ.. మహాత్మా గాంధీ చూపిన సత్యం, అహింస మార్గాలు సమాజానికి ఎల్లప్పుడూ ఆదర్శప్రాయమని అన్నారు గాంధీజీ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని సూచించారు.