రైతులకు లో-వోల్టేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు

17-10-2026 | 04:30pm

దేవరకద్ర నియోజకవర్గంలో 2,000కు పైగా ట్రాన్స్‌ఫార్మర్ల పంపిణీ

మూసాపేట: రైతులకు() లో-వోల్టేజీ(Low-voltage) సమస్యలు లేకుండా నాణ్యమైన విద్యుత్‌ సరఫరా(Electricity supply) అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్‌రెడ్డి(Devarakadra MLA G. Madhusudhan Reddy) తెలిపారు. మూసాపేట మండలం జానంపేట విద్యుత్‌ ఉపకేంద్రం(Janampet Electrical Substation) వద్ద అడ్డాకుల, మూసాపేట మండలాల రైతులకు వ్యవసాయ(Agriculture) అవసరాల కోసం ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలో ఇప్పటివరకు 2,000కు పైగా ట్రాన్స్‌ఫార్మర్లను పంపిణీ చేసి లో-వోల్టేజీ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

మదనాపురం మండలం తిరుమలాయపల్లిలో రూ.15 కోట్లతో విద్యుత్‌ సామర్థ్యాన్ని పెంచే పీటీఆర్‌ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలో 12 విద్యుత్‌ ఉపకేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన చేయగా, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్‌ అధికారులు, రైతులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు