ప్రజావాణిలో సమస్యలపై ఫిర్యాదు
జడ్చర్ల, అక్టోబర్ 26: ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని రెండో వార్డు కావేరమ్మపేట గ్రామ చావిడి సమీపంలో నెలకొన్న విద్యుత్ సమస్యలపై మాజీ కౌన్సిలర్(Former Councilor) బుక్క మహేష్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రమాదకరంగా ఉన్న ఐరన్ పోల్స్‌ను వెంటనే తొలగించి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కావేరమ్మపేటలో నెలకొన్న లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరారు. విద్యుత్ కన్జ్యూమర్ ఫోరంలో గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెండింగ్‌లో ఉన్న విద్యుత్ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించి, ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు నివేదిక సమర్పించారు. ప్రజలకు ప్రమాదం కలిగించే విద్యుత్ పోల్స్‌ను తొలగించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని బుక్క మహేష్ అధికారులను కోరారు.