గణేష్‌పై దాడి.. ఇద్దరిపై కేసు నమోదు

21-09-2026 | 09:53pm

గండీడ్,(విజయక్రాంతి): మండల పరిధిలోని జంగంరెడ్డిపల్లి గ్రామం(jangamreddipalli village)లో గణపతి నిమజ్జనం(Ganapati immersion) అనంతరం ఇంటికి వెళ్తున్న వ్యక్తిపై ఇద్దరు దాడి చేసిన ఘటనపై కేసు నమోదైనట్లు మహ్మదాబాద్ ఎస్‌ఐ శేఖర్‌రెడ్డి తెలిపారు. గత మధ్యరాత్రి సుమారు 12:45 గంటల సమయంలో జంగంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కోస్గి గణేష్ కుమార్ నిమజ్జనం కార్యక్రమం అనంతరం ఇంటికి వెళ్తుండగా, అదే గ్రామానికి చెందిన బోయమోని హనుమంతు, బోయమోని సీనులు అతడిని అడ్డగించి కొట్టినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

మరిన్ని వార్తలు