ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

21-09-2026 | 09:56pm

భీమిని, (విజయక్రాంతి): ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని ఎంపీడీవో రమేష్(MPDO Ramesh) అన్నారు. సోమవారం మంచిర్యాల జిల్లా భీమిని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలపై అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సత్వర న్యాయం అందించాలని అధికారులకు సూచనలు చేశారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేలా అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలన్నారు. ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు అధికారులు చొరవ తీసుకోవాలన్నారు. ప్రజావాణిలో ఒక దరఖాస్తు వచ్చినట్లు వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీఓ మోహినుద్దీన్, సూపరింటెండెంట్ వేణుగోపాల్, ఏవో రజిత, విద్యుత్ రాజనర్సు, ఆర్ అండ్ బి, మిషన్ భగీరథ, ఏ ఈ పి ఆర్  పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు