ఎంబీబీఎస్ సీటు సాధించిన గాయత్రికి ఆర్థిక సాయం

02-10-2026 | 10:33pm

మహమ్మదాబాద్ అక్టోబర్ 2 (విజయక్రాంతి): మండల కేంద్రానికి చెందిన చిట్టేల కిష్టమ్మ, బాల కిష్టయ్య దంపతుల కుమార్తె చిట్టేల గాయత్రి ఎంబీబీఎస్ సీటు సాధించి, పటాన్‌చెరువు సమీపంలోని రాజరాజేశ్వరి మెడికల్ కళాశాల(Rajarajeshwari Medical College)లో అడ్మిషన్ పొందింది. గాయత్రి వైద్య విద్యను కొనసాగించేందుకు ఆర్థికంగా సహాయం చేయాలని వాట్సాప్ గ్రూపుల్లో చేసిన విజ్ఞప్తికి పలువురు స్పందించారు.

ఈ క్రమంలో వివిధ వర్గాలకు చెందిన వారు అందించిన విరాళాలతో మొత్తం రూ.30 వేల ఆర్థిక సహాయం సమకూరింది. శుక్రవారం మహమ్మదాబాద్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో సమావేశం నిర్వహించి, ఎంబీబీఎస్ సీటు సాధించిన గాయత్రిని సన్మానించారు. అనంతరం ఆమెకు రూ.30 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అడ్వకేట్ ఈ.రాములు మాట్లాడుతూ గాయత్రి కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. భవిష్యత్తులో సమాజానికి తన వంతు సేవ చేయాలని సూచించారు.

కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ, శాంతి రంగ్యా, గండీడ్  ఎంఈఓ రుద్రారం జనార్ధన్, అనంతయ్య గుప్తా, రహీం, లక్ష్మీకాంత్ రెడ్డి, ముంతాజ్, షెగ్గారి వెంకటయ్య, కప్లాపూర్ ఆశన్న,టిచర్ పాండు నాయక్, బోరు కృష్ణయ్య, దానకారి సురేష్, పత్తి గోపాల్, రుద్రారం కృష్ణయ్య,దితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు