పేదల సొంతింటికి ప్రభుత్వం భరోసా

30-09-2026 | 12:00pm

గండీడ్,సెప్టెంబర్ 30(విజయక్రాంతి): నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పరిగి ఎమ్మెల్యే(MLA), టీపీసీసీ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి(Rammohan Reddy) అన్నారు.మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్‌లను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.అనంతరం లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డుల(Smart ration cards)ను అందజేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరేలా అధికారులు,ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచి ఆర్.భగవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జి.అనంతలక్ష్మారెడ్డి,ఆర్ శ్రీనివాస్ రెడ్డి,తాసిల్దార్ రాజగోపాల్,ఎ.జితేందర్ రెడ్డి, ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ నాయకులు,అధికారులు, కార్యకర్తలు,లబ్ధిదారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు