మహాత్ముడికి ఘనంగా నివాళులు

02-10-2026 | 11:46am

రాజాపూర్:  భారత స్వతంత్ర సమరయోధుడు జాతిపిత మహాత్మా గాంధీ జయంతి(Mahatma Gandhi Jayanti) వేడుకలు శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామకృష్ణ, ఎంపీడీవో విజయలక్ష్మి, ఉప సర్పంచ్ రేష్మ నజీమ్ బేగ్, మండల వ్యవసాయ అధికారి ప్రదీప్ కుమార్, పంచాయతీ కార్యదర్శి వినయ్ కుమార్, వార్డు సభ్యులు విక్రం రెడ్డి, యాదగిరి, సత్యనారాయణ, రమణ, నాగరాజు, వెంకటేష్, లింగం, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు