భూత్పూర్ లో రికార్డ్ స్థాయిలో వినాయకుని లడ్డు వేలం

24-09-2026 | 08:06pm

రూ. 2, 01,000 లక్షలకు లడ్డును కైవసం చేసుకున్న మున్సిపల్ చైర్మన్ 

భూత్పూర్, సెప్టెంబర్ 24 :  భూత్పూర్ మున్సిపాలిటీలోనే (Bhootpur Municipality)ఎన్నడూ జరగని విధంగా రికార్డు స్థాయిలో వినాయక స్వామి లడ్డును వేలం పాట రికార్డు బద్దలు కొట్టింది. భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డు లో రాందాస్ తండా యువజన సంఘం సభ్యులు వినాయకుడి మండపం దగ్గర ఏర్పాటు చేసిన  వినాయక లడ్డు భక్తుల మధ్య పోటా పోటీగా వేలం పాట  కొనసాగింది.  లడ్డు వేలం పాటలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి రూ. 2,01,000 లక్షల కు సొంతం చేసుకున్నారు.

మండప కమిటీ సభ్యులు చైర్మన్ బాలకోటి కి ఘనంగా శాలువలు కప్పి సన్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ నిత్య పూజలు అందుకున్న వినాయకుడి లడ్డు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా చిన్న లడ్డు రూ. 1,31,000 రాత్లవత్  రాజు దక్కించుకున్నారు. వినాయకుడి కలశం రూ. 35 వేలకు అంగోత్ గణేష్, వినాయకుడి పంచ రూ.16 వేలకు మూడవత్ నరేష్, వినాయకుడి పండ్లు రూ. 17,100 కు రాత్లవత్ గోవిందు లు దక్కించుకున్నారు. అనంతరం వారు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు