29 ఎద్దులను తరలిస్తున్న వారిపై కేసు

23-10-2026 | 10:00pm

భూత్పూర్, అక్టోబర్ 23 : భూత్పూర్ మున్సిపాలిటీ(Bhoothpur Municipality) పరిధిలోని షేర్ పల్లి (బి) గ్రామ శివారులో ఎన్ హెచ్ 44 రహదారిపై బీట్ డ్యూటీ చేస్తున్న పోలీసులు ఒక కంటైనర్ వాహనాన్ని తనిఖీ చేశారు. ఆ కంటైనర్ లో అక్రమంగా 29 ఎద్దులను కాళ్లు కట్టి సరైన గాలి, ఆహారం లేకుండా ఉన్నాయి. ఈ ఎద్దులను షాద్నగర్ పట్టణం నుంచి  వాహనంలో ఎక్కించుకొని తమిళనాడు రాష్ట్రానికి తరలిస్తున్నట్లు విచారణలో వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే వాహనంతో పాటు ఎద్దులను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు