ఆడపడుచుల ఆటపాటలు

23-10-2026 | 10:08pm

అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు!

మహా అన్నదానం ప్రారంభించిన ఉపసర్పంచ్ కర్నాటి కోటేశ్వరి రామ కృష్ణారెడ్డి

కల్లూరు, అక్టోబర్ 23 (విజయక్రాంతి): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు(Telangana culture and traditions) ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు(Bathukamma Celebrations) కల్లూరు మండలం రఘునాథగూడెంలో ఘనంగా జరిగాయి. తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు, యువతులు ఆటపాటలతో సందడి చేశారు. బతుకమ్మల చుట్టూ తిరుగుతూ జానపద గీతాలు ఆలపించి, గౌరమ్మకు పూజలు నిర్వహించారు. కుటుంబాల సంక్షేమం, పాడిపంటల సమృద్ధి, ప్రజల సుఖసంతోషాలను కాంక్షించారు.

ఈ సందర్భంగా భారీగా అన్నదాన కార్యక్రమం(Food Donation Program) నిర్వహించగా, గ్రామ ఉపసర్పంచ్ కర్నాటి కోటేశ్వరి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కుక్కా రానా, రామకృష్ణారెడ్డి, ముళ్లపాటి కృష్ణయ్య, హుస్సేన్ రెడ్డి, భద్రారెడ్డి, రంగారావు, వెంకట్ రెడ్డి, రామిరెడ్డి, మహేష్ రెడ్డి, లక్ష్మణరావు తదితరులతో పాటు గ్రామ పెద్దలు, మహిళలు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు