యాకన్న గూడెంలో ఇసుక ర్యాంపు

23-10-2026 | 09:59pm
  1. పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ. 
  2. హాజరైన  ములుగు అడిషనల్ కలెక్టర్ మహేంద్ర. 

వెంకటాపురం నూగూరు అక్టోబర్ 23 (విజయక్రాంతి): ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని ఎదిర గ్రామపంచాయతీ యాకన్న గూడెం గ్రామంలో ఇసుక రీచ్ గురించి పర్యావరణ ప్రజా అభిప్రాయ సేకరణ సమావేశం(Public Consultation Meeting on the Environment) శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ములుగు జిల్లా అడిషనల్  కలెక్టర్ మహేంద్ర, ఖనిజ అభివృద్ధి సంస్థ అదికారులు, పీసా కమిటి, మండల అధికారులు పాల్గొన్నారు. 

గోదావరి నదిలో 24 నాలుగు హెక్టార్లలో ఇసుక సేకరణకు, అనుమతులు లభించాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి వరంగల్ ప్రాంతీయ కార్యాలయం అధికారులు, రెవిన్యూ అధికారులు, టీఎస్ఎండిసి. అదికారులు పాల్గొని ప్రజాప్రాయ సేకరణ నిర్వహించారు. 

ఎన్విరాన్మెంట్ పబ్లిక్ హి రింగులో సొసైటీ  సభ్యులు, గ్రామస్తులు, పీసా కమిటి, ఇంకా పలువురు పాల్గొని సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ సమావేశంలో పలువురు తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు