ప్రశాంతంగా ముగిసిన వినాయక నిమజ్జనం
24-09-2026 | 08:50pm
జడ్చర్ల, సెప్టెంబర్ 24: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలో తొమ్మిదవ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా మున్సిపల్ కమిషనర్ ఎం. గిరీష్(Municipal Commissioner M. Girish) ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టారు. నిమజ్జన కార్యక్రమం సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, శాంతిభద్రతలకు ఎలాంటి ఆటంకం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది.మొత్తం 280 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయడం జరిగింది.
ఈ కార్యక్రమం మొత్తం ప్రశాంత వాతావరణంలో నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎం.గిరీష్, మున్సిపల్ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.