గంజాయి మొక్కలు స్వాధీనం..

13-10-2026 | 11:37pm

నిందితుల అరెస్ట్...

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో గంజాయి మొక్కలు కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను చెన్నూర్ పోలీసులు(Chennur Police) అదుపులోకి తీసుకున్నారు. చెన్నూర్ పట్టణ సిఐ బన్సీలాల్ ఈ ఘటనకు సంబంధించి  ప్రెస్‌మీట్ లో  వివరాలు  వెళ్లడించారు.తమ సిబ్బంది 

పెట్రోలింగ్‌లో భాగంగా తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న మహారాష్ట్రకు చెందిన వ్యక్తులను తనిఖీ చేయగా వారి వద్ద గంజాయి మొక్కలు ఉన్నట్లు గుర్తించారు..ఒక వ్యక్తి వద్ద 4 గంజాయి మొక్కలు రూ.15 వేల విలువైనవి,  మరో వ్యక్తి వద్ద 350 చిన్న గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.ఈ సందర్భంగా పట్టణ సీఐ బన్సీలాల్ మాట్లాడుతూ గంజాయి సేవించడం, విక్రయించడం, అక్రమంగా రవాణా చేయడం లేదా సరఫరా చేయడం వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు..

యువత గంజాయికి దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల అక్రమ కార్యకలాపాలపై పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు, గంజాయి అక్రమ కార్యకలాపాల నియంత్రణకు నిరంతరం పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలిపారు..

మరిన్ని వార్తలు