అన్నపూర్ణ మాతగా దివ్య దర్శనం ఇచ్చిన అమ్మవారు

13-10-2026 | 11:13pm

వెంకటాపురం నూగూరు (విజయక్రాంతి): మండల కేంద్రంలోని రజక బజారులో వేంచేసియున్న దుర్గామాత కమిటీఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవా(Sri Devi Sharannavaratri Utsavams)ల్లో భాగంగా మూడో రోజు అమ్మవారు అన్నపూర్ణ మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక అలంకరణలో కొలువుదీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివచ్చారు.

పూజా కార్యక్రమాలతో మండపం ప్రాంగణం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా అమ్మవారికి కూరగాయల అలంకరణ  రాజమహేంద్రపు మల్లికార్జునరావు లక్ష్మి కుమారి దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. చిన్న మూర్తి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు తనంతరం తీర్థప్రసాదాలు భక్తులకు అందజేశారు దంపతులు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కార్యక్రమంలో, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు