45 ఏళ్ల ఎస్బీఐ శాఖ తరలింపుపై గ్రామస్తుల ఆందోళన
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం జాజిరెడ్డిగూడెంలో గత 45 సంవత్సరాలుగా సేవలందిస్తున్న స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(State Bank of India) శాఖను వేరే గ్రామానికి తరలిస్తున్నారనే వార్తలపై గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.బ్యాంకు తరలింపు ఆపాలని కోరుతూ మంగళవారం గ్రామంలో భారీ సంతకాల సేకరణ చేపట్టారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ జాజిరెడ్డిగూడెం గ్రామంలో రైతులు,మహిళా సంఘాలు, విద్యార్థులు,వృద్ధులు,పెన్షన్ దారులకు ఇదే ఏకైక బ్యాంక్ అని,బ్యాంకును తరలిస్తే రోజు బ్యాంకు పనులకు వచ్చే వారు దాదాపు 10 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా గ్రామంలో సంతకాలు సేకరించిన అనంతరం అట్టి వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్,ఎస్బీఐ రీజనల్ మేనేజర్ కు అందజేస్తామని,బ్యాంకు యాజమాన్యం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని,జాజిరెడ్డిగూడెం గ్రామంలోనే బ్యాంకును కొనసాగించాలని గ్రామస్తులు,రైతులు,ఖాతాదారులు విజ్ఞప్తి చేశారు.