ఆమ్రపాలి క్యాడర్ వివాదం.. తీర్పు రిజర్వ్!

13-10-2026 | 05:54pm

హైదరాబాద్: ఐఏఎస్ అధికారి ఆమ్రపాలి(IAS Amrapali) క్యాడర్ కేటాయింపు వివాదం మరో కీలక దశకు చేరుకుంది. తనను తెలంగాణకు కేటాయించాలన్న అంశంపై సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన తీర్పుపై హైకోర్టు(High Court) విధించిన స్టేను సవాల్ చేస్తూ ఆమ్రపాలి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసినట్లు సమాచారం.

గతంలో ఆమ్రపాలిని తెలంగాణ క్యాడర్‌కు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఐఏఎస్ ఆమ్రపాలి కేడర్ కేటాయింపు కేసు(IAS Amrapali Cadre Allocation Case)పై హైకోర్టు తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుందన్న ఆసక్తి నెలకొంది. తీర్పు వెలువడిన తర్వాతే క్యాడర్ కేటాయింపుపై తదుపరి పరిణామాలు స్పష్టమవుతాయి.

మరిన్ని వార్తలు