కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే క్షమాపణ చెప్పాలి..

27-10-2026 | 04:06pm

చెన్నూర్, (విజయక్రాంతి):  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై(Prime Minister Narendra Modi) చేసిన అనుచిత వ్యాఖ్య,ను   కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun Kharge) వెనక్కి తీసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బేషరతుగా  క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ నాయకులు డిమాండ్ చేశారు.

మంచిర్యాల జిల్లా చెన్నూర్ లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధికార ప్రతినిధి గర్రెపల్లి వెంకటనర్సయ్య మాట్లాడుతూ  రాజకీయాల్లో విమర్శలు ,ప్రతివిమర్శలు హుందాగా ఉండాలి కానీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు   దేశ ప్రధానిపై  విమర్శలు చేసేటప్పుడు కనీస గౌరవ ప్రదంగా మాట్లాడకపోవడం వారి కుసంస్కృతికి నిదర్శనమని  విమర్శించారు.ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కాయిత వెంకటేష్ , మధురాజ్, ప్రసాద్,ముత్యాల శ్రావణి, చిరంజీవి, అడపా శ్రీనివాస్, మణికరౌతు శంకర్, చాకటి శ్యామ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు