విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది...
తాడ్వాయి,అక్టోబర్,27( విజయ క్రాంతి ): దివ్యాంగ విద్యార్థులకు క్రీడలు నిర్వహించడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని తాడువాయి ఎంఈఓ రామస్వామి(Taduvai MEO Ramaswamy) తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో మంగళవారం మండల స్థాయి దివ్యాంగులకు ప్రత్యేక క్రీడలు నిర్వహించారు.ఈ క్రీడలకు ముఖ్యఅతిథిగా రామస్వామి విచ్చేసి మాట్లాడారు.
క్రీడలతో విద్యార్థులలో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయవచ్చన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ఈ క్రీడలు ఎంతగానో దోహదపడతాయని ఆయన తెలిపారు. క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయన్నారు. ఈ క్రీడల్లో 30 మంది దివ్యాంగ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారని తెలిపారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు.
ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు దమ్మున్న గారి సంగారెడ్డి,తాడ్వాయి ఇంచార్జ్ శ్రీకాంత్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మజ,పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా అధ్యక్షులు అంబీర్ మనోహర్ రావు తదితరులు పాల్గొన్నారు.