ఈటల రాజేందర్‌కు ఘన సన్మానం

30-09-2026 | 09:48pm

చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూరు నియోజకవర్గ కేంద్రంలో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌కు స్థానిక బీజేపీ, బీజేవైఎం నాయకులు ఘన స్వాగతం పలికి సన్మానించారు. బెల్లంపల్లి నియోజకవర్గం వేమనపల్లి మండలానికి వెళ్తున్న క్రమంలో ఈటల రాజేందర్‌(Etela Rajender) మార్గమధ్యలో చెన్నూరుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ(BJP) జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌ గౌడ్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు,చెన్నూర్ మున్సిపాలిటీ 18వ వార్డు కౌన్సిలర్  ఏతం శివకృష్ణతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శాలువాతో సత్కరించి   ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు