బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత
సుల్తానాబాద్,(విజయ క్రాంతి): రానున్న బతుకమ్మ వేడుకలకు సర్వం సిద్ధం చేస్తున్నట్లు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్(Sultanabad Municipality) వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత తెలిపారు. బుధవారం మున్సిపల్ పరిధిలోని 9, 10 వ వార్డుల అనుసంధానంగా ఉన్న కుంటకట్టను జెసిబి సహాయంతో శుభ్రపరచి కట్టపైకి వెళ్లేలా రహదారిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు(MLA Chintakunta Vijaya Ramana Rao) సహకారంతో ఆధునికరిస్తున్నట్లు వివరించారు.
మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో పూలనే దేవతగా కొలిచే బతుకమ్మ వేడుక(Bathukamma Celebrations)కు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దని లక్ష్యంతో వార్డులో కాలనీలను శుభ్ర పరచడంతో పాటు కట్ట వరకు చక్కటి రహదారి నిర్మాణం చేపట్టి కట్టపై విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు పండుగ సమయంలో విద్యుత్ కాంతులతో అద్భుతంగా మలుస్తున్నట్లు తెలిపారు. అన్ని వసతులు కల్పించి బతుకమ్మ పండుగ విజయ వంతంగా మహిళలు నిర్వహించుకునేలా చర్యలు చేపడతానని అంతటి పుష్పలత తెలిపారు.