ఘనంగా ముగిసిన ఎస్జిఎఫ్ క్రీడలు
గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపల్(Gummadidala Municipality) కేంద్రంలోని శ్రీ వివేకానంద ఉన్నత పాఠశాల(Sri Vivekananda High School)లో ఏర్పాటు చేసిన 70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ మండల స్థాయి క్రీడా పోటీలు బుధవారం ముగిసాయి. ముఖ్యఅతిథిగా చైర్మన్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంపొందించుకోవాలని దానికి తల్లిదండ్రులు కృషి చేయాలని క్రీడల ద్వారా క్రమశిక్షణతో పాటు ఉన్నత ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మానసిక ఉల్లాసం, శారీరక దారుఢ్యం పెంచేలా క్రీడాలు ఉపయోగ పడతాయని తెలిపారు.
బాలుర విభాగంలో వాలీబాల్ అండర్ 17 ప్రథమ స్థానం జడ్.పి.హెచ్.ఎస్ గుమ్మడిదల ద్వితీయ స్థానం అభ్యుదయ ఉన్నత పాఠశాల, అండర్ 14 ప్రథమ స్థానం అభ్యుదయ ఉన్నత పాఠశాల, జడ్పీహెచ్ఎస్ కానుకుంట, బాలికల విభాగం అండర్ 17 మొదటి స్థానం ఎస్వీహెచ్ఎస్ ద్వితీయ స్థానం ఎస్ వి హెచ్ ఎస్ స్మార్ట్ కిడ్స్ గుమ్మడిదల, అండర్ 14 మొదటి స్థానం జడ్పీహెచ్ఎస్ కానుకుంట, రెండవ స్థానం ఎస్వీహెచ్ఎస్, ఖో ఖో బాలుర విభాగం అండర్ 17 మొదటి స్థానం జడ్పీహెచ్ఎస్ గుమ్మడిదల రెండవ స్థానం జడ్.పి.హెచ్.ఎస్ కానుకుంటా అండర్ 14 మొదటి స్థానం జడ్.పి.హెచ్.ఎస్ గుమ్మడిదల ద్వితీయ స్థానం జడ్పిహెచ్ఎస్ బొంతపల్లి బాలికల విభాగం అండర్ 17 మొదటి స్థానం జడ్పీహెచ్ఎస్ గుమ్మడిదల ద్వితీయ స్థానం వివేకానంద గ్లోబల్ స్కూల్ అండర్ 14 మొదటి స్థానం జడ్పీహెచ్ఎస్ గుమ్మడిదల, ద్వితీయ స్థానం వివేకనంద గ్లోబుల్ స్కూల్, కబడ్డీ బాలుర విభాగం అండర్ 17 మొదటి స్థానం వివేకనంద గ్లోబల్ స్కూల్, ద్వితీయ స్థానం డాన్ బాస్కో హైస్కూల్, అండర్ 14 మొదటి స్థానం సీఎంఆర్ హై స్కూల్, ద్వితీయ స్థానం జడ్పీహెచ్ఎస్ బొంతపల్లి, బాలికల విభాగం అండర్ 17 మొదటి స్థానం ప్రగతి హై స్కూల్, ద్వితీయ స్థానం జడ్పీహెచ్ఎస్ అన్నారం, అండర్ 14 మొదటి స్థానం జడ్పీహెచ్ఎస్ బొంతపల్లి ద్వితీయ స్థానం జడ్పీహెచ్ఎస్ గుమ్మడిదలగా గెలుపొందాయి. ఈ కార్యక్రమంలో ఎంఈఓ పౌలిన రెడ్డి, వైస్ చైర్మన్ చిమ్ముల సంధ్య గోవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, శ్రీ వివేకానంద ప్రిన్సిపల్ లత జైపాల్ రెడ్డి,వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు,విద్యార్థులు పాల్గొన్నారు.