చెన్నూర్ లో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు..
02-10-2026 | 05:47pm
చెన్నూర్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో గాంధీ జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్సిపాలిటీ చైర్ పర్సన్ పెద్దింటి పద్మ శ్రీనివాస్(Municipal chairperson Peddinti Padma Srinivas), కమిషనర్ మారుతి ప్రసాద్, కౌన్సెలర్లు, నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ పద్మ శ్రీనివాస్ మాట్లాడుతూ మహాత్ముడు చూపిన మార్గంలో నడవాలన్నారు. మహాత్ముడు దేశ స్వాతంత్రం కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఆయన అనుసరించిన విధానాలు అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు.