ప్రజావాణిలో ఫిర్యాదుల స్వీకరణ

19-10-2026 | 06:49pm

మంచిర్యాల టౌన్: కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రాములు సోమవారం డీఆర్ఓ మోతిరామ్ తో కలిసి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో 13 దరఖాస్తులు అందాయని, ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించే విధంగా అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

సీఎం ప్రజావాణి, జిల్లా ప్రజావాణి ద్వారా అందిన దరఖాస్తులను ప్రతి వారం పెండింగ్ లో లేకుండా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ వరకు వాట్సాప్ ద్వారా 110 దరఖాస్తులు అందాయని, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు