ఉరి వేసుకొని బాలుడు మృతి

19-10-2026 | 07:51pm

అశ్వారావుపేట అక్టోబర్ 19 (విజయక్రాంతి): అశ్వారావుపేట(Aswaraopeta) మున్సిపాలిటీ పరిధిలోని నెహ్రూనగర్ లో కాగిత శ్రీ రంజిత్(19) బాలుడు వారి అమ్మమ్మ అయిన పానుగంటి కుమారి ఇంటిలో ఊరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు అశ్వారావుపేట పోలీసులు తెలిపారు. వారు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మృతుడి తల్లిదండ్రులు కాగిత నాగ ముత్యాల రావు-జ్యోతిలు సుమారు 2 సంవత్సరాల నుండి విడిగా ఉంటున్నారని మనస్తాపానికి గురై మరణించినట్లు తెలుస్తోందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దేవ్ సింగ్ SI తెలిపారు.

మరిన్ని వార్తలు