అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి
ఘట్ కేసర్, అక్టోబర్ 19 (విజయక్రాంతి): పోచారం డివిజన్ పరిధి ప్రతాపసింగారంలో శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గ భవాని కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీదుర్గాభవాని మండపం ఆవరణలో వై.ఎస్.రెడ్డి ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అన్నప్రసాద దాతగా వ్యవహరించిన మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జి, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి(Enugu Sudarshan Reddy) ముందుగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దివంగత ఏనుగు సంగీత రెడ్డి స్మారకార్థం నిర్వహించిన ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమం సేవాభావానికి, ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచింది. పండుగ వేళ భక్తులకు అన్నప్రసాదం అందించడం ద్వారా నిర్వాహకులు తమ సేవాభావాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ బిజెపి అధ్యక్షులు సురేష్ నాయక్, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి శివనాయక్, కమిటీ సభ్యులు కె. భూపాల్ యాదవ్, డి. రాజు, బి. రాజు, కె. శివాజీ, ఎ. రవీందర్, తదితరులు పాల్గొన్నారు.