వినాయక నిమజ్జనం వేడుకల్లో మంత్రి వివేక్..
23-09-2026 | 11:00pm
చెన్నూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో వినాయక నిమజ్జన(Vinayaka Immersion) వేడుకలలో రాష్ట్ర మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి(MLA Gaddam Vivek Venkatswamy) పాల్గొన్నారు. అత్యంత వైభవంగా, కోలాహలంగా సాగుతున్న వినాయక నిమజ్జన శోభయాత్రలో భక్తులతో పాటు ఆడిపాడారు.
వినాయక మండపాల వద్ద ప్రత్యేక పూజలు చేసి, పట్టణంలోని పెద్ద చెరువులో వినాయకుల నిమజ్జనం కార్యక్రమాన్ని మంత్రి వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతానన్నారు.
ఇప్పటికే పుష్కరాల పనులు ప్రారంభం చేసుకోవడం జరిగింది. పెద్ద చెరువులోని శివాలయానికి సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి రూ. 17 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేసుకోవడం జరిగిందని తెలిపారు. అధికారులు, నాయకులు పాల్గొన్నారు.