కాంగ్రెస్ మండల ఎస్సీ సెల్ చైర్మన్ గా చెట్లపల్లి సుదర్శన్ ఎన్నిక

23-09-2026 | 11:02pm

తూప్రాన్, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): తూప్రాన్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ సెల్ చైర్మెన్ గా చెట్లపల్లి సుదర్శన్ ఇమాంపూర్ అధికారికంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చిట్కూల మహిపాల్ రెడ్డి ప్రోద్బలంతో మెదక్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు తాడేపు మహేందర్(SC Cell President Tadepu Mahender), కాంగ్రెస్ నేతల ఆధ్వర్యంలో ఈ ఎన్నికల ప్రక్రియ జరిగింది.

ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ నాకు ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి అన్నకు జిల్లా ఎస్సీ మహేందర్ కు కృతజ్ఞతలు తెలియచేస్తూ కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కష్టపడి పనిచేస్తానని ఎల్లపుడూ సహాయంగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇందులో మున్సిపల్ అధ్యక్షులు గరిగె నర్సింగరావ్, జావేద్ పాషా, జితేందర్, యండి. అప్సార్, చిట్టిమిల్ల అనిల్, ఉమర్, నాగరాజు, శ్రీకాంత్, సాగర్ నవీన్, తదితర కార్యకర్తలు ఉన్నారు.

మరిన్ని వార్తలు