నిర్లక్ష్యం షార్ట్ ఫిలిం విడుదల చేసిన ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 29, (విజయ క్రాంతి): హెల్మెట్ ప్రాధాన్యతను తెలియజేస్తూ 70MM యూట్యూబ్ ఛానల్ లో(70MM YouTube Channel) వస్తున్న సందేశాత్మకంగా నిర్లక్ష్యం షార్ట్ ఫిలిం ని ఈరోజు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ చేతులమీదుగా 70MM యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ షార్ట్ ఫిలిం బాగుందని సన్నివేశాలన్నీ సహజసిద్ధంగా ఉన్నాయన్నారు.
నటీనటులంతా చక్కగా నటించారని ప్రశంసించారు. టీం సభ్యులంతా ఇతర పనులు ఏం చేస్తున్నారు వారి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అందరూ స్వీట్ అండ్ షాట్ వీడియోస్ చూస్తున్నారని తక్కువ సందేశం ఇచ్చేలా భవిష్యత్తులో షార్ట్ ఫిలింలో రూపకల్పన చేయాలని సమాజాన్ని చైతన్యపరిచే మేలుకొల్పే షార్ట్ ఫిలిం లను తీయాలని తెలిపారు.
పది నిమిషాల నివిడి గల షార్ట్ ఫిలిం మొత్తము చూసి ప్రతి సన్నివేశాన్ని ప్రతి ఆర్టిస్టుని అబ్జర్వ్ చేసి నటినట్టులను ప్రశంసించారు. దర్శకుడు శ్రీనివాస్ దొడ్డ పనితీరు బాగుందని అన్నారు. లోటుపాట్లను సైతం తెలియజేసారు. అనంతరం టీం సభ్యులు ఎస్పీ రోహిత్ రాజును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో , దర్శకుడు శ్రీనివాస్ దొడ్డ, నటీనటులు జలాల్, ఆవుదుర్తి సతీష్, ప్రేమ్ సాగర్ బాబు. సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు