గాయపడిన వృద్ధురాలికి ఆర్థిక సహాయం
19-10-2026 | 06:47pm
నార్సింగి/చేగుంట అక్టోబర్ 19: నార్సింగి మండలం(Narsingi Mandal) భీమరావుపల్లి గ్రామానికి చెందిన కొంగాల పోచమ్మ తన ఇంట్లో ప్రమాదవశత్తు కాలు విరగడంతో, రెడ్డిపల్లి, (పిఏసిఎస్) డైరెక్టర్ కుమార్ నిరుపేద కుటుంబం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న విషయం తెలుసుకున్న కుమార్ వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. పేదరికంలో ఉన్న కుటుంబాన్ని ఆదుకోవడం తన బాధ్యతగా భావించి, తన వంతు సహాయంగా నగదు అందజేసి మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కాపు ప్రవీణ్, బోయిని మల్లేశం పాల్గొన్నారు.