ఏడుపాయల హుండీ ఆదాయం రూ.49.26 లక్షలు

22-09-2026 | 09:47pm

పాపన్నపేట, సెప్టెంబర్ 22: దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయంగా.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయ(Edupayala Vanadurga Mata Temple) హుండీలను ఆలయ కార్యనిర్వాహణాధికారి మఠం వీరేశం, హుండీ పర్యవేక్షకురాలు విజయలక్ష్మి సమక్షంలో మంగళవారం గోకుల్ షెడ్ లో లెక్కించారు. శ్రీ వెంకట అన్నమాచార్య సేవా సమితి సభ్యులు, మెదక్ ఇండియన్ బ్యాంక్, ఆలయ సిబ్బంది లెక్కించారు. గడిచిన 80 రోజుల హుండీని లెక్కించగా రూ.49,26,228 ఆదాయం సమకూరింది. మిశ్రమ బంగారం 000.080.000 గ్రాములు రాగ, మిశ్రమ వెండి 000.768.000 గ్రాములు వచ్చింది. ఆలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు