నీటి విషయంలో రాష్ట్రాన్ని ముంచింది ఎవరు?
హైదరాబాద్: ఎల్ నినో ప్రభావం(El Nino effect) ప్రపంచంలోని చాలా దేశాలపై ఉందని మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) పేర్కొన్నారు. జూరాల డ్యామ్ వద్ద వాళ్లు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదని, రైతులను బీఆర్ఎస్(BRS) నేతలు రెచ్చగొడుతున్నారని ఆయన మండిపడ్డారు. రైతులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని, నీళ్ల కోసం కర్ణాటక ప్రభుత్వంతో చర్చిస్తున్నామని మంత్రి తెలిపారు. నీళ్లు ఎంత ఉన్నాయి.. తాగునీర అవసరం ఎంత ఉందో తెలుసా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని, రైతులకు మేలు జరగాలనే ఉద్దేశం బీఆర్ఎస్ నేతలకు లేదని మంత్రి వాకిటి శ్రీహరి వ్యాఖ్యానించారు.
811 టీఎంసీల్లో 299 టీఎంసీలు సరిపోతాయని నాడు మీరు చెప్పలేదా?, నీటి విషయంలో రాష్ట్రాన్ని ముంచింది ఎవరు? అని నిలదీశారు. రాష్ట్ర రైతులపట్ల మరణశాసనం రాసింది మీరు, రైతులు, వ్యవసాయ పేటెంట్ కాంగ్రెస్ దే అని ఆయన తెలిపారు. బీఆర్ఎష్ నేతలు నోటికి ఎంతోస్తే అంత మాట్లాడుతున్నారని, కర్ణాటక ప్రభుత్వం(Government of Karnataka) కాళ్లు పట్టుకోవాలని బీఆర్ఎస్ అంటోందని, రైతుల కోసం మేం కాళ్లు మొక్కుతాం.. మొక్కితే తప్పేముంది? అని మంత్రి విరుచుకుపడ్డారు. రేపు జూరాలకు నీటిని విడుదల చేస్తామని ఇవాళ బీఆర్ఎస్ హడావుడి చేస్తోందని, పాలమూరు జిల్లా గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ కు లేదని మంత్రి వాకిటి శ్రీహరి ఆగ్రహించారు.