మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్
22-09-2026 | 07:10pm
హైదరాబాద్: గణేశ విగ్రహాల అంతిమ నిమజ్జనం(Immersion of Ganesha idols) నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేందుకు మద్యం అమ్మకాలు(Alcohol sales) నిలిచిపోనున్నాయి. సెప్టెంబర్ 25వ తేదీ ఉదయం 6 గంటల నుండి సెప్టెంబర్ 26వ తేదీ ఉదయం 6 గంటల వరకు సైబరాబాద్ పరిధిలోని స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్‌లలోని బార్లను మినహాయించి, మద్యం, కల్లు దుకాణాలు బార్ అండ్ రెస్టారెంట్లు(Bars and restaurants) మూసివేయాలని సైబరాబాద్ పోలీసులు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ చట్టం-1968(Telangana State Excise Act)లోని సెక్షన్ 20 కింద సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డా.ఎం.రమేష్(Cyberabad CP Dr. M. Ramesh) ఈ ఉత్తర్వులను జారీ చేశారు.