బీఆర్ఎస్‌పై మంత్రి ఫైర్
హైదరాబాద్: కృష్ణా జలాల(Krishna waters) వాటాల్లో బీఆర్ఎస్ తీవ్ర నష్టం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy) పేర్కొన్నారు. కమీషన్ల కోసం జూరాలలో 70 టీఎంసీలతో ప్రాజెక్టు డిజైన్ మార్చారని, జూరాల వద్దే ప్రాజెక్టు కట్టి ఉంటే వరద నీటిని వాడుకునే అవకాశం ఉండేదని ఆయన మండిపడ్డారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని, రూ1.88 లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదని విమర్శించారు. ఎల్ నినో వచ్చిందని బీఆర్ఎస్ సంబరపడుతోందని, ప్రాజెక్టులు సరిగా కట్టి ఉంటే ఎల్ నినో వచ్చినా నీటి సమస్య ఉండదన్నారు.
Also Read: తెలంగాణ నీళ్లపై కొత్త చర్చ..
నీటి కష్టాలకు ఎల్ నినో ఎంత కారణమో బీఆర్ఎస్(BRS) అంతే కారణమని, 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ పూర్తి చేస్తామని, సంపాదన కోసమే ప్రాజెక్టులు అన్నట్లు బీఆర్ఎస్ చూసిందని మంత్రి ఎద్దేవా చేశారు. జూరాలకు నీళ్లు ఇవ్వాలని కర్ణాటక ముఖ్యమంత్రిని నేను, సీఎం రేవంత్ రెడ్డి కోరామని, మా విజ్ఞాప్తికి కర్ణాటక సీఎం సానుకూలంగా స్పందించారని ఉత్తమ్ వెల్లడించారు. ప్రజలు ఇబ్బంది పడితే బీఆర్ఎస్ పార్టీ సంబరపడుతోందని, పాలమూరు-రంగారెడ్డి నిర్మాణాన్ని కుట్ర పూరితంగా జాప్యం చేశారు.