నగరంలో భారీ వర్షం

22-09-2026 | 06:25pm

హైదరాబాద్:  నగరంలోని పలు ప్రాంతాల్లో భారీగా వర్షం(Heavy rain) కరుస్తుంది. మంగళవారం సాయంత్రం వర్ష మొదలవడంతో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పాడుతోంది. కుత్బుల్లాపూర్, గాజులరామారం, చింతల్, జగద్గిరి గుట్ట, సూరారం, బహదూర్ పల్లి, దుండిగల్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, బాగ్ లింగంపల్లి, గాంధీనగర్, దోమలగూడ, రామ్ నగర్, కూకట్ పల్లి, జేఎన్టీయూ, బంజారా హిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, ఎస్ఆర్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎర్రగడ్డ, కోఠి, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ, హిమాయత్ నగర్, ట్యాంక్ బండ్, లక్డీకపూల్, దిల్‍సుఖ్‍నగర్, మూసాపేట్ నిజాంపేట్, కేపీహెచ్బీ సహా తదితర ప్రాంతాల్లో వర్షం పడుతుంది. ఇప్పటికే హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు(Hyderabad Traffic Police) వాహనాదారులకు రెయిన్ అలర్ట్ జారీ చేశారు. ముఖ్యంగా సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌, చార్మినార్‌, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లో సాయంత్రం 5:45 గంటల నుంచి 7 గంటల మధ్య తీవ్ర నుంచి అత్యంత తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు.

మరిన్ని వార్తలు