మేడ్చల్ బిజెపి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు
22-09-2026 | 10:28pm
మేడ్చల్ అర్బన్ సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): సేవా సంకల్ప్ భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేవైం అధ్యక్షులు రాగం అర్జున్ ఆధ్వర్యంలో మేడ్చల్ శ్రీ గార్డెన్ కల్యాణ మండపంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా,ప్రధాన మంత్రిగా 25 సంవత్సరాలు పూర్తి చేసుకుని దేశ ప్రజలకు కావాల్సిన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేశారని ఆయన కొనియాడారు.