కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా జిన్న స్వామి ఎన్నిక

09-10-2026 | 10:47pm

తూప్రాన్, అక్టోబర్ 9, (విజయక్రాంతి): మెదక్ జిల్లా(Medak District) తూప్రాన్ మండలం మల్కాపూర్ కాంగ్రెస్ గ్రామ కమిటీ(Malkapur Congress Village Committee) అధ్యక్షుడిగా జిన్న స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి(Thoomkunta Narsa Reddy) ఆదేశాల మేరకు మండల వ్యాప్తంగా గ్రామ కమిటీలు వేయడం జరిగింది. ఇందులో భాగంగా నూతన మల్కాపూర్ కాంగ్రెస్  గ్రామ కమిటీ, కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. వీరితోపాటు ఉపాధ్యక్షుడిగా బట్టికాడ స్వామిగౌడ్, ప్రధాన కార్యదర్శిగా ధరావత్ శ్రీధర్, యూత్ ప్రెసిడెంట్ గా చిర్ర చెన్నకేశవరెడ్డి, 

కోశాధికారిగా పల్లెపాటి అశోక్ లు ఎన్నికైనట్లు తెలిపారు. ఇందులో కాంగ్రెస్ నేత యాంజాల విఠల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జింక మల్లేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లెర్ల రవీంద్ర గుప్తా, తూప్రాన్ మాజీ వైస్ చైర్మన్ నంద్యాల శ్రీనివాస్, నూతన కార్యవర్గ సభ్యులు తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు