నైన్ ఎడ్యుకేషన్ కళాశాలపై చర్యలు తీసుకోవాలి

23-11-2026 | 08:14pm

ప్రజావాణిలో మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ కు వినతి

మేడిపల్లి, నవంబర్ 23 (విజయక్రాంతి): బోడుప్పల్ సర్కిల్ పరిధిలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న  నైన్ ఎడ్యుకేషన్ కళాశాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సోమవారం ఏఐఎస్ఎఫ్ మేడ్చల్ జిల్లా కార్యదర్శి ఎండి. అన్వర్(AISF Medchal District Secretary MD Anwar) మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్  విజయేందర్ కి ప్రజావాణిలో వినతిపత్రం అందజేశారు.

నైన్ ఎడ్యుకేషన్ కళాశాలలో  విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, డే స్కాలర్, రెసిడెన్షియల్ పేర్లతో తరగతులు నిర్వహిస్తున్నారని తెలిపారు. అయితే కళాశాలకు అవసరమైన ప్రభుత్వ అనుమతులు లేవని, నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నారని, ఈ విషయాన్ని పలుమార్లు ఇంటర్మీడియట్ బోర్డు జిల్లా విద్యాశాఖ అధికారి దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, కళాశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు