దుర్గమాతల నిమజ్జనానికి ఘనంగా ఏర్పాట్లు
ముకరంపుర, అక్టోబర్ 19 (విజయక్రాంతి): కరీంనగర్(Karimnagar) నగరపాలక సంస్థ ద్వారా దుర్గమాత విగ్రహాల నిమజ్జన మహోత్సవానికి సర్వం సిద్ధం చేశామని నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ వెల్లడించారు. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21వ తేదీన నగరంలో వైభవంగా జరగనున్న దుర్గమాత నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో సోమవారం సంబంధిత అధికారులతో కలిసి పలు నిమజ్జన పాయింట్లను సందర్శించి, పరిశీలించారు. మానకొండూర్, కొత్తపల్లి నిమజ్జన పాయింట్ల వద్ద జరుగుతున్న ఏర్పాట్లను మేయర్ క్షుణ్ణంగా పరిశీలించారు. భక్తులకు, ఉత్సవ కమిటీ సభ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు సూచనలు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పోరేటర్లు, అధికారలు పాల్గొన్నారు.