అనురాగ్ ఏఐఎంఎల్ విద్యార్థినికి ఉద్యోగం
జెపి మోర్గాన్ చేస్ లో అనురాగ్ ఏఐఎంఎల్ విద్యార్థినికి రూ.19.75 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం
ఘట్ కేసర్, అక్టోబర్ 4 (విజయక్రాంతి) : అనురాగ్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్(Anurag University Artificial Intelligence and Machine Learning) (ఏఐఎంఎల్) విభాగానికి చెందిన బీ.టెక్ నాలుగో సంవత్సరం విద్యార్థిని అల్లి హర్షిత(Alli Harshitha) ప్రతిష్ఠాత్మక జెపి మోర్గాన్ చేస్ సంస్థలో సిస్టమ్స్ ఇంజినీర్ గా ఉద్యోగం సాధించారు. ఆమెకు సంవత్సరానికి రూ.19.75 లక్షల వేతన ప్యాకేజీ లభించింది.
హర్షిత సాధించిన ఈ విజయం ఆమె కృషి, పట్టుదల, సాంకేతిక నైపుణ్యం, నిరంతర అభ్యాసానికి నిదర్శనమని ఏఐఎంఎల్ విభాగం పేర్కొంది. ఆమె విజయం అనురాగ్ యూనివర్సిటీలో విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీస్తూ, పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందిస్తున్న విద్యా వ్యవస్థకు ప్రతిబింబంగా నిలిచిందని తెలిపారు. ఈసందర్భంగా హర్షితను ఏఐఎంఎల్ విభాగాధిపతి డాక్టర్ ఎ. మల్లికార్జున రెడ్డి అభినందించారు. ఆమె భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.