పాల మార్కెట్లో అముల్ హవా..
భూమిపూజ చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మెదక్: తెలంగాణలో పాడి పరిశ్రమను మరింత అభివృద్ధి చేసే దిశగా ఒక కీలక అడుగు పడింది. మెదక్ జిల్లా తూప్రాన్‌లోని 'ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో 'సబర్ డైరీ మెగా ఇంటిగ్రేటెడ్ డైరీ ప్లాంట్' నిర్మాణానికి కేంద్రమంత్రి కిషాన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం జరిగింది. ఈ భారీ స్థాయి ఇంటిగ్రేటెడ్ డైరీ ప్లాంట్ ఏర్పాటుతో రాష్ట్రంలో అమూల్ డైరీ(AMUL Dairy) కార్యకలాపాలపై గణనీయమైన ఆసక్తి నెలకొంది. ఈ సందర్బంగా కిషాన్ రెడ్డి మాట్లాడుతూ... రూ. 400 కోట్లతో 18 నెలల్లో సాబర్ డెయిరీ ప్లాంట్ నిర్మాణం జరుగుతుందని.. అమూల్ డెయిరీ పరిశ్రమతో భూములు లేని రైతులకు మేలు కలుగుతుందని పేర్కొన్నారు.
కోఆపరేటివ్ సొసైటీలో రాజకీయాలు చేరి నిర్వీర్యమయ్యాయని, అలాగే సహకర సంఘాలను రైతులకు పునర్నిర్మాణం చేసుకోవాలని తెలిపారు. రైతులు కలిసి కోఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేసుకోవాలని, సహకర వ్యవస్థ గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని అన్నారు. కేంద్రం కొత్తగా కోఆపరేటివ్ మంత్రిత్వశాఖను స్థాపించిందని, రాష్ట్రంలో 1525 కోఆపరేటివ్ సొసైటీల ఏర్పాటుకు కేంద్రం నిర్ణయం తీసుకుందన్నారు. శ్వేత విప్లవంలో తెలంగాణ కీలకపాత్ర పోషించాలన్నారు. దీంతో మెదక్ ప్రాంతంతో పాటు తెలంగాణలోని పాడి రైతులకు ఈ ప్లాంట్ ఎంత మేరకు ఉపయోగపడనుందన్నది రానున్న రోజుల్లో కీలకంగా మారనుంది.