KA13 టైటిల్ ఇదేనా? రేపే రివీల్!

04-10-2026 | 05:35pm

హీరోగా వరుస సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) ఇప్పుడు మరో డిఫరెంట్ ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈసారి హీరోగా నటించడంతో పాటు KA13(KA13 Title Glimpse) మూవీని స్వయంగా డైరెక్ట్ చేస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను కూడా మేకర్స్ కొత్త తరహాలో ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటివరకు KA13 Movie Titleపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా సస్పెన్స్ కొనసాగించారు. అయితే ఈ సస్పెన్స్‌కు రేపు తెరపడనుంది. అక్టోబర్ 5న ఉదయం 11.05 గంటలకు KA13 టైటిల్ గ్లింప్స్‌తో పాటు రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు. దీంతో కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్‌లో ఆసక్తి మరింత పెరిగింది. ఇక ఈ అనౌన్స్‌మెంట్‌కు ముందు కిరణ్ అబ్బవరం కొత్త పోస్టర్‌తో సోషల్ మీడియాలో సందడి చేశారు. “రేపు కలుద్దాం” అంటూ ఆయన ఇచ్చిన అప్‌డేట్‌తో అసలు KA13 Title(Kiran Abbavaram Upcoming Movie) ఏంటన్నదానిపై క్యూరియాసిటీ పెరిగింది. టైటిల్ ఎలా ఉండబోతోంది? రిలీజ్ డేట్ ఎప్పుడు? అనే ప్రశ్నలకు అక్టోబర్ 5న సమాధానం రానుంది. హీరోగా నటిస్తూ దర్శకత్వ బాధ్యతలు కూడా చేపట్టిన కిరణ్ అబ్బవరం ఈ Kiran Abbavaram Upcoming Movieను ఏ స్థాయిలో తెరకెక్కించారో తెలియాలంటే టైటిల్ గ్లింప్స్(KA13 Glimpse) వచ్చే వరకు వేచి చూడాల్సిందే. KA13 Latest Update కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మరిన్ని వార్తలు