అంగన్వాడీ కేంద్రాలను సందర్శించిన బిజెపి నాయకులు

24-09-2026 | 07:05pm

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(Cyberabad Municipal Corporation) మేడ్చల్ సర్కిల్ పరిధిలోని కిస్టాపూర్, పూడూరు మున్సిపల్ పట్టణంలోని అంగన్వాడి కేంద్రాలను బిజెపి మేడ్చల్ నియోజకవర్గ కాంటెస్ట్ బిజెపి(BJP) ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి జిల్లా బిజెపి స్పోక్ పర్సన్ బచ్చు కృష్ణ ప్రియ మల్లారెడ్డిలు సందర్శించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, పిల్లలకు, అందజేస్తున్నటువంటి గుడ్లు, పాలు, పౌష్టికాహారాలు, భోజనం, పప్పు రోజుకో రకమైన కూరగాయలు అంగన్వాడి కేంద్రాల(anganwadi centers)లో ఏ విధంగా అందుతున్నాయో అని కేంద్రాలలోకి వెళ్ళి కనుక్కోవడం జరిగిందని బచ్చు కృష్ణ ప్రియ మల్లారెడ్డి పేర్కొన్నారు.

అంగన్వాడి కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పిల్లలకు సదుపాయాలు ఎలా అందుతున్నాయో అని పిల్లలను తల్లులను అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆమే చెప్పారు. అంగన్వాడి కేంద్రాలలో తమ పిల్లలతో పాటు తల్లులు తీసుకుంటున్నటువంటి భోజనం కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుందని కృష్ణ ప్రియ మల్లారెడ్డి వెల్లడించారు. అంగన్వాడి కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు ఉన్న కూడా మాకు చెప్పాలని పిల్లల తల్లులకు సూచించినట్లు ఆమే స్పష్టం చేశారు. అదేవిధంగా అంగన్వాడి కేంద్రంలో ఉన్న టీచర్ లను,ఆయాలను శాలువాలతో సన్మానించి పిల్లలకు తిను బండారాలను ఇచ్చి వారితో కాసేపు ముచ్చడించినట్లు కృష్ణ ప్రియ మల్లారెడ్డి వెల్లడించారు.

అనంతరం మేడ్చల్ నియోజకవర్గ బిజెపి కాంటెస్ట్ ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం గర్భిణీ స్త్రీలకు బాలింతలకు పిల్లలకు పౌష్టికాహారాలను సరఫరా చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా అంగన్వాడి కేంద్రాలకు గత 15 సంవత్సరాల నుంచి పౌష్టికాహారాలను సరఫరా చేయడం జరుగుతుందని సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు