జవహర్ నగర్ లో సర్వం లంబోదరమయం

25-09-2026 | 08:05pm
  1. శంకర తనయ షణ్ముఖ వాహన
  2. గణనాథుని దర్శించుకున్న... జిల్లా బిఆర్ఎస్ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి                               

జవహర్ నగర్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): పార్వతీ పుత్రుడు మూషిక వాహనుడు ఆదిమూల మహా గణపతి అనాధ రక్షకుడు ఆ కన్నెమూల మహాగణపతియే అని మేడ్చల్ బిఆర్ఎస్ ఇంచార్జ్ చామ కూర మహేందర్ రెడ్డి(BRS In-charge Chama Koora Mahender Reddy) అన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ (Malkajgiri Municipal Corporation)పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ బృందావన్ కాలనీలో శుక్రవారం కాలనీవాసులు నెలకొల్పిన గణనాధున్నీ శుక్రవారం బిఆర్ఎస్ శ్రేణులతో కలసి దర్శించారు.

అనంతం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాల స్వీకరించారు. అనంతరం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ గణనాథుడు ముల్లోకాల్లోనే శక్తివంతమైన దేవుడని ఆదిమూల మహాగణపతి ఆ గణనాధుని దర్శించుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయన్నారు. జవహర్ నగర్ ప్రజల మీద చల్లని చూపులు ఉండాలని ఆ లంబోధరున్ని కోరుకున్నట్టు తెలిపారు. సర్వవిజ్ఞాలకు అధిపతి అయిన గణపతి దేవుని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, బిఆర్ఎస్ నాయకులు, మేకల అయ్యప్ప, కూటి కంటి వెంకటేష్ గౌడ్, మూల సోమయ్య గౌడ్, పంతంగి సిద్ధులు యాదవ్, ప్రసాద్ గౌడ్, కార్యకర్తలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు